విజయోత్సాహంలో వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు... గుంపులో ఉన్నప్పుడు వ్యక్తిగత బాధ్యత మర వకూడదు...ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర ద్వారా యువకులకు కౌన్సెలింగ్...

విజయోత్సాహంలో వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు

గుంపులో ఉన్నప్పుడు వ్యక్తిగత బాధ్యత మరవకూడదు

ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర ద్వారా యు వకులకు కౌన్సెలింగ్
ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు క్రైం,జూన్, 03 :

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయం సాధించిన సందర్భం గా ఇటీవల కర్నూలు నగరంలోని రాజ్ విహార్ సెంటర్‌లో కొందరు యువకులు ప్రభుత్వ,ప్రైవే ట్ ఆస్తులను ధ్వం సం చేయడంతో పాటు బ స్సుల అద్దాలను పగులగొట్టిన ఘటన చోటుచే సుకుంది.ఈ ఘటనలో పాల్గొన్న 18మందిని క ర్నూలు టూ టౌన్ పోలీసులు గుర్తించి గత సో మవారం అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.ఇలాంటి సంఘటనలు పున రావృతం కాకుండా యువతలో అవగాహన క ల్పించేందుకు బుధవారం కర్నూలు నగరంలో ని సుంకే సుల రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర ద్వారా ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం ని ర్వహించారు.ఈ సందర్భంగా సైకాలజిస్ట్ సుధీ ర్ సండ్ర మాట్లాడుతూ...అభిమాన జట్టు విజ యం సాధించినప్పుడు ఆనందం వ్యక్తం చేయ డం సహజమేనని,అయితే మాబ్ కల్చర్‌లో ప డి వ్యక్తిత్వా న్ని,విలువలను,క్యారెక్టర్‌ను కోల్పో వడం సరికాదని తెలిపారు.గుంపులో ఉన్న ప్పుడు కొందరు "అందరూ చేస్తున్నారు కదా" అనే భావనతో తాము సాధారణంగా చేయని పనులు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆస్తుల ధ్వంసం,చట్టవ్యతిరేక చర్యలకు పాల్ప డడం వంటి చర్యలు క్షణికావేశంలో జరిగిన ప్పటికీ వాటి ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని వివరించారు.ప్రతి వ్యక్తి తన చర్యలకు తానే బాధ్యత వహించాల్సి ఉంటుందని,ఒకసారి చేసిన చిన్న తప్పు కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరించా రు.క్రీడలను క్రీడాస్ఫూర్తితో స్వీకరిస్తూ గెలుపు-ఓటములను సమానంగా చూడాలని,బాధ్య తాయుతంగా ప్రవర్తించి సమాజానికి ఆదర్శం గా నిలవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్,టూ టౌన్ పోలీ స్ స్టేషన్ సిబ్బంది,కళాశాల యాజమాన్యం,ఇ తరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...