మునిసిపల్ కాంట్రాక్టర్ కురువ రంగయ్యపై దా డి చేసిన వారిపై కేసు నమోదు చేసి,అరెస్ట్ చే యాలి...కేసులు నమోదు చేయకుండా నిర్ల క్ష్యం చేస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి..బి.గిడ్డయ్య,సిపిఐ జిల్లా కార్య దర్శికె.జగన్నాథం,ఏపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి...
మునిసిపల్ కాంట్రాక్టర్ కురువ రంగయ్యపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి,అరెస్ట్ చేయాలి
కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తు న్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకో వాలి
బి.గిడ్డయ్య,సిపిఐ జిల్లా కార్యదర్శి
కె.జగన్నాథం,ఏపి రైతు సంఘం రాష్ట్ర కార్య దర్శి
కర్నూలు నగరంలోని శ్రీరాంనగర్ లో రోడ్డు పని చేస్తున్న కాంట్రాక్టర్ కురువ రంగయ్యపై అధికా ర పార్టీ నాయకులు దాడి చేసి గాయపరచడా న్ని సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య,ఏపీ రై తు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథంలు తీవ్రంగా ఖండించారు.రంగయ్య గత 40 సంవ త్సరాల నుండి కర్నూలు నగరంలో కాంట్రాక్టు పనులు చేస్తున్నాడని,ఇప్పటివరకు పనుల నా ణ్యత విషయంలో ఫిర్యాదులు లేవని,జూన్, 16వ తేదీన శ్రీరాంనగర్ లో రోడ్డు పని చేయి స్తున్న కాంట్రాక్టర్ రంగయ్యపై అధికార పార్టీ పే రు చెప్పుకునే కొంతమంది నాయకులు బెది రించి,డబ్బులు డిమాండ్ చేశారని,డబ్బులు ఇ వ్వలేదనే అక్కసుతో దాడి చేసి గాయపరిచా రని అన్నారు.దాడి చేసిన వారిపై చర్య తీసు కోమని మూడవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేస్తే,కేసులు నమోదు చేయాల్సిన పోలీసు అధికారులు దాడి చేసిన వారికి అండగా నిల వడం,కేసులు నీరుగార్చడం దారుణమని,ని ష్పక్షపాతంగా పనిచేయాల్సిన పోలీసులు అధి కార పార్టీ వారికి వత్తాసు పలకడం సరైందికా దన్నారు.దాడి జరిగి వారం రోజులు దాటినా కే సులు నమోదు చేయకుండ నీరుగార్చడం వల న బాధితులకు,పోలీసులు మీద నమ్మకం పో తుందని,తక్షణమే జిల్లా ఎస్పీ స్పందించి కురు వ రంగయ్యపై దాడి చేసిన దుండగులపై నాన్ బైబుల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిం చాలని బి.గిడ్డయ్య,కె.జగన్నాధంలు డిమాండ్ చేశారు.
Comments
Post a Comment