మొబైల్ ఫోన్‌ చోరీ యత్నంను భగ్నం చేసిన కా ర్మికుడు...

మొబైల్ ఫోన్‌ చోరీ యత్నం భగ్నం చేసిన కార్మికుడు
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,బెంగళూరు,జూ న్,21 :

మొబైల్ ఫోన్ చోరీ యత్నంను ఒక కార్మికుడు చాకచక్యంతో భగ్నం చేసిన ఘటన బెంగళూ రులో జరిగింది.వివరాలు ఇలా ఉన్నాయి... పోలీసుల కథనం ప్రకారం...బెంగళూరు,కబ్బ న్‌పేట 14వ క్రాస్ వద్ద స్కూటర్‌పై వచ్చిన ఇద్ద రు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తి మొబైల్ ఫోన్‌ను లాక్కుని పారిపోవడానికి ప్ర యత్నించారు.బాధితుడు వెంటనే గట్టిగా కేక లు వేయడంతో,సమీపంలో పనిచేస్తున్న ఒక కార్మికుడు వారిని అడ్డుకోవడానికి స్కూటర్ పై కి ఒక గోనె సంచి మూటను విసిరాడు.మూట తగలడంతో స్కూటర్ నియంత్రణ కోల్పోయిం ది.దీంతో స్కూటర్‌తో పాటు దొంగిలించిన ఫోన్‌ ను అక్కడే వదిలేసి ఆ ఇద్దరు నిందితులు పా రిపోయారు.అయితే ఘటనా స్థలానికి కొంత దూరంలోనే జునైద్ (18) అనే నిందితుడు ఫు ట్‌పాత్‌పై ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్క డే ప్రాణాలు కోల్పోయాడు.మృతుడికి అంతకు ముందే గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.ఈ కేసులోని రెండో నిందితుడైన 23 ఏళ్ల అర్బాజ్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ స్నాచింగ్ యత్నానికి సంబంధించిన దృశ్యాలు,ఆ తర్వాత జరిగిన పరిణామాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యా యి.పోలీసులు ఆ ఫుటేజీని స్వాధీనం చేసు కున్నారు.ప్రస్తుతం హలసూరు గేట్ పోలీస్ స్టే షన్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమో దు చేశారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...