పని చెయ్యకపోతే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తా...ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్...
పని చెయ్యకపోతే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తా
ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
టీడీపీ ఎమ్మెల్యేలకు అధినేత నారా చంద్ర బా బు నాయుడు మరోసారి వార్నింగ్ ఇచ్చారు.ప నిచేయకపోతే పక్కన పెట్టేస్తానంటూ హెచ్చ రించారు.పదవులు ఎవరికీ శాశ్వతం కాదన్న చంద్రబాబు...పనిచేసి నంతకాలం పదవులకు ఢోకా ఉండదన్నారు.మొన్నటి ఎన్నికల్లో చాలా మంది తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలుపొందా రని..వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోకుం డా జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గురించి మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో వ ర్క్ షాప్‌లో నిర్వహించారు.ఈ వర్క్ షాప్‌లో పాల్గొన్న చంద్రబాబు...ఈ కీలక వ్యాఖ్యలు చే శారు.ఈ క్రమంలోనే జూన్ నాలుగో తేదీన ఎన్డీ ఏ నేతల సమావేశం జరగనున్నట్లు వెల్లడిం చారు.కూటమి పార్టీల మధ్య సమన్వయం కో సం నియోజకవర్గం,జిల్లా,రాష్ట్రస్థాయిలో ఎన్టీ ఏ సమన్వయ కమిటీలను నియమించనున్న ట్లు చంద్రబాబు ప్రకటించారు.బలం ఎక్కువా, తక్కువ అని చూడకుండా క్షేత్రస్థాయిలో మిత్ర పక్షాలను కలుపుకుని వెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు.కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల ని...అధికారంలో వారిని భాగస్వామ్యులను చే సుకోవాలని సూచించారు.ఎమ్మెల్యేల ప్రవర్తన బాగుంటేనే ప్రజలు ఓట్లు వేస్తారన్న సీఎం...ప్ర వర్తన బాగోలేకపోతే ఓట్లు వేయరనే విషయా న్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని సూచించా రు.నోరు పారేసు కుని అనవసర వివాదాల్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలని అప్రమ త్తం చేశారు.మరోవైపు సర్వి షయంలో అ ప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఎమ్మెల్యే లకు సూచించారు.మిత్రపక్షాలతో కలిసి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు.2002 త ర్వాత ఏపీలో ఓటర్ల జాబితా సవరణ జరుగు తోందని...టీడీపీ ఓట్లు తీసేసి,వైసీపీ ఓట్లు చే ర్చేలా కుట్రలు చేసే అవకాశం ఉందని చంద్రబా బు హెచ్చరించారు.ఈ నేపథ్యంలో మాకేం సం బంధం అన్నట్లుగా ఉండొద్దని...జులై,14వ తేదీ లోపు ఓట్లు ఉండేలా చూసుకోకపోతే ఇబ్బం దులు వస్తాయని హెచ్చరించారు.పార్టీ ఉంటేనే ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని అం దరూ నడుచుకోవాలని సూచించారు.ఇదే స మయంలో సర్ ప్రక్రియపై శిక్షణా తరగతులకు హాజరు కాని నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్య క్తం చేశారు.
Comments
Post a Comment