ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్యా సామగ్రి పంపిణీ చేయాలి... మౌలిక సదుపాయాలు కల్పించాలి...ఉపా ధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలి...పి.ఎస్. యు విద్యార్థిసంఘం జిల్లా కార్యదర్శి సురేష్...
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్యా సామగ్రి పంపిణీ చేయాలి
మౌలిక సదుపాయాలు కల్పించాలి
ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలి
పి.ఎస్.యు విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి సురేష్
కర్నూలు జిల్లా పి.జి.ఆర్.ఎస్ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక కార్యక్రమంలో పి. ఎస్.యు విద్యార్థి సంఘం జిల్లా బి.సురేష్,జి ల్లా ఏపీసి ఎన్.లోకనాథ్ కి వినతిపత్రాన్ని అం దజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ 11 రోజులు అవుతున్న జిల్లాలోని అనేక ప్రభు త్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు,నోట్‌బుక్స్,షూస్,బ్యాగ్స్ పూ ర్తిగా అందలేదని తెలిపారు.దీంతో ముఖ్యంగా పేద,మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వి ద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా పలు ప్ర భుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథ కంలో చిక్కిలు కూడా అందడం లేదని,తాగునీ రు,మరుగుదొడ్లు,తరగతి గదులు,ఫర్నిచర్,వి ద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కొరత ఉం దని పేర్కొన్నారు.విద్యార్థుల సంఖ్యకు తగినం త మంది ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల వి ద్యా ప్రమాణాలు దెబ్బ తింటున్నాయని అన్నా రు.కావున జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల ల విద్యార్థు లకు ఉచిత విద్యా సామగ్రిని వెం టనే పంపిణీ చేయడంతో పాటు,మౌలిక సదు పాయాలను మెరుగుపరచి,ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలని ఏపీసి ఎన్.లోకనా థ్ ని కోరినట్లు తెలిపారు.విద్యార్థుల భవి ష్య త్తు కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకో వాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Post a Comment