కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం...

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
ప్రజా చరిత్ర న్యూస్,కర్ణాటక,జూన్,03 :

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీ కారం చేశారు.కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గెహ్లోత్ ప్రమాణ స్వీకారం చేయించారు.ఐతే ...ఈ ప్రమాణానికి ముందు..డీకే...స్టేజీపై సా ష్టాంగ నమస్కారం చేయడం ద్వారా...ఓటర్ల కు తాను రుణపడి ఉన్నాననే సంకేతం ఇచ్చా రు.ఉప ముఖ్యమంత్రిగా పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేయగా...మరో 13మంది మంత్రులు గా ప్రమాణం చేశారు.స్పీకర్ గా హెచ్కే పాటిల్ ఉండబోతున్నారు.కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స భ్యుడిగా సిద్ధరామయ్య ఉండ బోతున్నారు. కార్యక్రమానికి కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలైన మల్లికా ర్జున ఖర్గే,రాహుల్ గాంధీ,కేసీ వేణుగోపాల్, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి,డీసీఎం భట్టి విక్రమార్క,కేరళ సీఎం,తదితరులు హాజ రయ్యారు.గవర్నర్ కార్యాలయం,లోక్ భవన్‌ లో చాలా సింపుల్‌గా ఈ కార్యక్రమం ఉండేలా డీకే ప్లాన్ చేసుకున్నారు.శివకుమార్‌కి య డ్యూరప్ప,దేవెగౌడలు శుభాకాంక్షలు చెప్పారు.

కర్ణాటక,34వ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రొఫైల్ : 

కాంగ్రెస్ పార్టీ 'ట్రబుల్ షూటర్', కేపీసీసీ అధ్య క్షుడు డి.కె.శివకుమార్ (దొడ్డలహళ్లి కెంపేగౌడ శివకుమార్) కర్ణాటక నూతన (34వ) ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

జననం : 

1962,మే,15న రామనగర జిల్లా,కనకపురలో వొక్కలిగ సామాజిక వర్గంలో జన్మించారు.వి ద్యార్థి దశలోనే యూత్ కాంగ్రెస్ ద్వారా క్రియా శీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

రాజకీయ ప్రస్థానం :

కనకపుర తదితర నియోజకవర్గాల నుంచి వ రుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి తన సత్తాచాటారు.2020 నుంచి కే పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ,2023 అసెంబ్లీ ఎ న్నికల్లో పార్టీ అద్భుత విజయానికి కీలక పాత్ర పోషించారు.

అధికార బాధ్యతలు : 

గత సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఉప ము ఖ్య మంత్రిగా,భారీ నీటిపారుదల,బెంగళూరు అభి వృద్ధి శాఖల మంత్రిగా సమర్థవంతంగా పనిచే శారు.అధికార బదిలీ ఒప్పందంలో భాగంగా ఇ ప్పుడు సీఎం పీఠాన్ని అధిరోహించారు.

కీలక వ్యూహకర్త : 

కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న అనేక సంక్షోభాల్లో ఆ యన ముందుండి నడిపించారు.ఆదాయపు పన్ను శాఖ,ఈడీ దాడులు,జైలు జీవితం వంటి అనేక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని పార్టీకి వి ధేయుడిగా నిలబడిన నాయకుడు.ఈ సుదీర్ఘ నిరీక్షణ,అ కుంఠిత దీక్షే ఆయనను ఒక సాధా రణ విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి నేడు క ర్ణాటక రాష్ట్ర అత్యున్నత పదవిని చేపట్టే స్థా యికి చేర్చాయి.భార్య ఉష,ముగ్గురు పిల్లలు ఆయన కుటుంబం.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...