నందిగామలో ఇంటింటికీ "'బడి పిలుస్తుంది... అడ్మిషన్ ఫారంతో విద్యార్థుల ఇంటికి వెళ్లిన డీఈఓ బృందం...

నందిగామలో ఇంటింటికీ "'బడి పిలుస్తుంది

అడ్మిషన్ ఫారంతో విద్యార్థుల ఇంటికి వెళ్లిన డీఈఓ బృందం
ప్రజా చరిత్ర న్యూస్,నందిగామ ప్రతినిధి, జూ న్,02 :

నందిగామ ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ పాఠశాల ల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచేం దుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన "బడి పిలుస్తుంది" కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విద్యా శాఖాధికారులు స్వయంగా రంగంలోకి దిగారు. మంగళవారం నందిగామ పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో డీఈఓ చంద్రకళ,డివైఈఓ గురునాథం,నందిగామ మండల విద్యా శాఖ అధికారులు,ఉపాధ్యాయుల బృందం ఇంటిం టికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి అ వగాహన కల్పించారు.ఈ సందర్భంగా డీఈఓ చంద్రకళ స్వయంగా ఒక కుటుంబానికి చెందిన విద్యార్థికి అడ్మిషన్ ఫారంను అందజేశారు.పిల్ల ల తల్లితో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలల్లో ల భించే సౌకర్యాలను వివరించారు.మధ్యాహ్న భోజనం,ఉచిత పాఠ్యపుస్తకాలు,యూనిఫాం, తల్లికి వందనం విద్యా కానుక,తల్లికి వందనం వంటి పథకాల గురించి తెలిపారు.అనంతరం డీఈఓ చంద్రకళ మాట్లాడుతూ "బడిఈడు పిల్లలు ఒక్కరు కూడా బడికి దూరం కాకూడ దు.ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నాం.తల్లిదండ్రులు ముందుకు వచ్చి పిల్లలను చేర్పించాలి" అని కోరారు.డివైఈఓ గురునాథం మాట్లాడుతూ,జూన్,12న పాఠశా లలు పునఃప్రారంభం అవు తున్నాయని,మొద టి రోజే 100శాతం హాజరు ఉండేలా ఉపాధ్యా యులు కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్ర మంలో మండల విద్యాశాఖ అధికారి,వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,సీఆర్పీలు, ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...