ఎలుకూరు బంగ్లా,నారాయణలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు...

ఎలుకూరు బంగ్లా,నారాయణలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కలెక్ట రేట్,జూన్,21:

ప్రపంచ వ్యాప్తంగా జూన్,2న జరుపుకునే అం తర్జాతీయ యోగా దినోత్సవాన్ని పుర స్కరిం చుకొని కర్నూలు నగరం,ఎలుకూరు బంగ్లా,నా రాయణ రెసిడెన్షియల్ స్కూల్లో ఘనంగా ఆది వారం అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడు కలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.పా ఠశాల ప్రాంగణంలో ఉదయం 6-00 గంటలకు జరిగిన కార్యక్రమానికి విద్యార్థులు,ఉపాధ్యా యులు,సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా యోగా బోధకుల ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు,ప్రాణాయామం,ధ్యా నం,తాడాసనం,వృ క్షాసనం,భుజంగాసనం వంటి ఆసనాలు అందరూ కలిసి సాధన చేశా రు.అనంత రం పాఠశాల ఎ.జి.ఎం.రమేష్ మా ట్లాడుతూ యోగా అనేది శరీరానికి,మనసుకు, ఆత్మకు సమతుల్యతను ఇస్తుందని చెప్పారు. ప్రిన్సిపాల్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రోజువారీ జీవితంలో యోగాను అలవాటు చే సుకుంటే ఏకాగ్రత,క్రమశిక్షణ,ఆరోగ్యం మెరుగు పడతాయని విద్యార్థులకు సూచించారు.వి ద్యార్థులు కూడా యోగా యొక్క ప్రాముఖ్యత గురించి చిన్న ప్రసంగాలు చేసి,యోగా మాన వాళికి ఇచ్చిన గొప్ప వరమని తెలిపారు.కార్య క్రమం చివర్లో అందరికీ ప్రశాంత, ఆరోగ్యం కలి గించేలా సామూహిక ధ్యానంతో ముగించారు. యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అ లవరచుకోవాలన్న సందేశంతో ఈ వేడుక విజ యవంతంగా ముగిసింది.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...