హత్యాయత్నం కేసులో ఇద్దరు ముద్దాయిల అరెస్ట్...విక్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

హత్యాయత్నం కేసులో ఇద్దరు ముద్దాయిల అరెస్ట్

విక్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు క్రైం, జూన్,21:

కర్నూలు నగరం,నాలుగవ పట్టణ పోలీ స్ స్టేషన్ పరిధి,కేశవ్ గ్రాండ్ హోటల్ సమీపం లోని కర్నూలు సిటీ కేఫ్ నందు గత మూడు రోజుల క్రితం సాయంత్రం సుమారు 7-00గం టల ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై జరి గిన హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితు లను అరెస్ట్ చేసినట్లు సిఐ విక్రమ్ సింహ తెలి పారు.ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో వి వరాలు వెల్లడించారు.కర్నూలు సిటీ కేఫ్ నం దు సాయంత్రం సుమారు 7-00గంటల ప్రాం తంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన పాత బస్తి గరీబు నగర్ కి చెందిన నవీద్ తన మిత్రు లు మెహబూబ్ బాషా,బీసన్నలతో కలిసి సద రు కర్నూలు సిటీ కేఫ్ లో మాట్లాడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఇద్దరు మగ వ్యక్తులు కేఫ్ లోకి అక్రమంగా ప్రవేశించి నవీద్ ని చం పాలనే ఉద్దేశంతో నవీద్ పై కత్తులతో దాడికి పాల్పడినట్లు చెప్పారు.దీంతో మెడ కింది భా గాన,భుజానికి మధ్య తీవ్రగాయాలు కలిగి తీ వ్ర రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం తన స్నేహితులు కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ తరలించి,నవీద్ స్నేహితుడు మహబూబ్ బా షా ఇచ్చిన ఫిర్యాదు మేరకు క ర్నూలు నాలుగ వ పట్టణ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.దర్యాప్తు లో భాగంగా సిసి ఫుటేజ్ లను పరిశీలించి దా డికి పాల్పడిన వారు నవీద్ ఇంటి సమీపాన ని వసిస్తున్న గుజిరి సామాన్ల వ్యాపారం చేసే షేక్ష, అతని అన్న కొడుకు అబ్దుల్ రెహమాన్,అత ని అక్క కొడుకు అయిన రెహాన్ లుగా గుర్తిం చడం జరిగిందన్నారు.అందులో ప్రథమ ము ద్దాయి షేక్ష,గౌరవ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారి ముందు శుక్ర వారం రోజున జూవేనైల్ కోర్ట్ నందు లొంగిపో గా,మిగిలి న ఇద్దరు ముద్దాయిలను గత శని వారం అరెస్టు చేసి,దాడికి ఉపయోగించిన రెం డు కత్తులు,ఒక ఆటోను సీజ్ చేసి,వారిద్దరిని గౌరవ మేజిస్ట్రేట్ ముందు హాజరు పెట్టగా రి మాండ్ ఆదేశించగా, పంచాలింగాల జైలుకి త రలించడం జరిగిందన్నారు.నవీద్,షేక్షల మధ్య ఎలుకూరు బంగ్లా వద్ద గల ఒక ఐదు సెంట్ల ప్లా ట్ విషయమై జరిగిన లావాదేవిలలో వచ్చిన మనస్పర్థలు ఈ హత్యాయత్నంకి దారి తీసిన ట్టు తెలిసింది అని సిఐ తెలిపారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...