రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక...
రైల్వే ప్రయాణికులకు హెచ్చరిక
రైల్వే ప్రయాణికుల భద్రత,క్రమశిక్షణను మెరు గుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 1989 రైల్వే చ ట్టాన్ని జన విశ్వాస్ పేరిట సవరించింది.ఈ మారిన చట్టాల ప్రకారం నిబంధనలు ఉల్లం ఘించే వారికి రైల్వే రక్షక దళం (RPF) ఇకపై అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించనుం ది.కాజీపేటలో ఆర్పీఎఫ్ అధికారులు దీనికి సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చే శారు.టికెట్ లేని ప్రయాణం,మహిళల కోచ్‌లోకి ప్రవేశించడం,ధూమపానం వంటి పలు నేరాల కు జరిమానాలు భారీగా పెంచారు.జరిమానా కట్టకుంటే కోర్టులో హాజరుపరిచి జైలుకు పంప నున్నారు.ట్రైన్లలో ప్రయాణించే ప్రయాణికుల భద్రతను పటిష్టం చేయడానికి,స్టేషన్లలో,రైళ్లలో క్రమశిక్షణను పెంపొందించడానికి కేంద్ర ప్రభు త్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది.రైల్వే ప్రాంగణాల్లో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే ధ్యేయంగా దశాబ్దాల నాటి 1989 రైల్వే చట్టంలో విప్లవాత్మక మార్పు లు చేస్తూ సవరణలు తీసుకువచ్చింది.జన విశ్వాస్ పేరి ట ప్రవేశపెట్టిన ఈ నూతన చట్ట సవరణల ద్వారా రైల్వే రక్షక దళానికి (RPF) అపరిమి తమైన అధికారాలను కల్పించారు.గతంలో ఆ ర్పీఎఫ్ అధికారులకు నేరుగా జరిమానాలు వ సూలు చేసే అధికారం ఉండేది కాదు.కానీ మా రిన నిబంధనల ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచే ఆర్పీఎఫ్ సిబ్బంది తప్పు చేసిన వారికి అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించేలా చట్టాన్ని మార్చారు.
Comments
Post a Comment