మాతృత్వానికే మచ్చ...ప్రియుడితో కలిసి పిల్ల లపై చిత్రహింసలు కాలిన గాయాలతో ఇద్దరు చిన్నారులు...తల్లి,ప్రియుడు అరెస్ట్...
మాతృత్వానికే మచ్చ
ప్రియుడితో కలిసి పిల్లలపై చిత్రహింసలు
కాలిన గాయాలతో ఇద్దరు చిన్నారులు
తల్లి,ప్రియుడు అరెస్ట్
మాతృత్వానికే మచ్చ తెచ్చేలా ఓ తల్లి తన ప్రి యుడితో కలిసి కన్నబిడ్డలపై అమానుషంగా చిత్రహింసలకు పాల్పడిన ఘటన వెలుగు చూ సింది.అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారు లను రోజూ వేధిస్తూ,వారి శరీరాలపై వాతలు పెట్టి తీవ్ర గాయా లకు గురిచేయడం స్థానికం గా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.పోలీసులు తెలిపిన వి వరాల ప్రకారం...బిహార్‌కు చెందిన పింకీ దేవి,సుజీత్ దంపతులు మూడేళ్ల క్రితం ఉపాధి కోసం వచ్చి స్థానిక పరిశ్రమలో కార్మికు లుగా పనిచేస్తున్నారు.వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.ఈ క్రమంలో పింకీ దేవికి,చిందుకు మార్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివా హేతర సంబంధంగా మారింది.భార్య ప్రవర్తన పై తరచూ గొడవలు జరుగుతుండటంతో భర్త సుజీత్ మూడు నెలల క్రితం ఇంటిని విడిచి వెళ్లి పోయాడు.అనంతరం పింకీదేవి తన ప్రి యుడు చిందుకుమార్‌ను ఇంటికే తీసు కొచ్చి సహజీవనం ప్రారంభించింది.తమ సంబంధా నికి పిల్లలు అడ్డుగా ఉన్నారనే కారణంతో ఆరే ళ్ల కుమార్తె ప్రియాంక,నాలుగేళ్ల కుమారుడు ఆ దిత్యపై ఇద్దరూ కలిసి దారుణంగా హింసకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.చిన్నారు ల శరీరాలపై వాతలు పెట్టడం,కాలిన గాయా లు చేయడం,తీవ్రంగా కొట్టడం వంటి క్రూర చ ర్యలను నిత్యకృత్యంగా మార్చుకున్నట్లు తెలి సింది.ఇంటి నుంచి తరచూ చిన్నారుల ఏడు పులు,అరుపులు వినిపించడంతో అనుమానం వచ్చిన కాలనీవాసులు బుధవారం ఇంటికి వె ళ్లి పరిశీలించారు.అక్కడ చిన్నారుల ఒంటిపై తీవ్ర గాయాలు,కాలిన మచ్చలు కనిపించడం తో దిగ్భ్రాంతికి గురయ్యారు.దీంతో ఆగ్రహిం చిన స్థానికులు తల్లి,ఆమె ప్రియుడిని పట్టు కుని పోలీసులకు అప్పగించారు.తీవ్రంగా గా యపడిన ఇద్దరు చిన్నారులను మెరుగైన చికి త్స కోసం హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుప త్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తల్లి పింకీ దేవి,ఆమె ప్రియు డు చిందుకు మార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.చిన్నారులపై జరిగిన అ మానుష హింసకు సంబంధించిన అన్ని కోణా ల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Post a Comment