చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం...

చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు క్రైం, జూన్,22 :

ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వ ర్యం లో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా  కర్నూ లు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవా రం చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈరన్న అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. జి ల్లా నలుమూలల నుంచి చేనేత కార్మికులు కో డుమూరు,ఎమ్మిగనూరు,ముడుమలకుర్తి,కొత్త కోట గ్రామాల నుంచి పెద్ద ఎత్తున చేనేత కార్మి కులు హాజరయ్యారు.ఈ సందర్బంగా చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే.రాజు,వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ సి.గురుశేఖర్, చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భరణి కాల ప్ప మాట్లాడుతూ రెక్కాడితేగాని డొక్కాడని చే నేతల బతుకులు వారి కనీస హక్కులు సాధిం చుకోవాలంటే అందరూ ఐక్యంగా ఉండి సాధిం చుకోవాలని అన్నారు.కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.25వేల కోట్లు కేటాయించాలి.రాష్ట్ర ప్రభు త్వం బడ్జెట్లో కనీసం రెండు వేల కోట్లు కేటా యించాలి.సకాలంలో నిధులు విడుదల చే యాలి.సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లిం చవల సిన రూ.203 కోట్ల బకాయిలను వెంట నే చెల్లించాలని వారన్నారు.అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కా వొస్తుంది.అయినా ఇంతవరకు చేనేత కార్మికు లకు పెన్షన్లు ఇవ్వలేదు.నేతన్న నేస్తం ద్వారా ప్రతి చేనేత కుటుంబానికి రూ.36వేలు సా యం అందించాలని,ఆరులైన వారందరికీ పెన్ష న్లు,ముద్ర రుణాలు,మూడు సెంట్లు జాగా ఇచ్చి ఇంటి ని ర్మాణం చేపట్టాలి.జిఎస్టిని పూర్తిగా ర ద్దు చేయాలని,సహకార సంఘాలకు ఉన్న రు ణాలను రద్దు చేయాలి.కేంద్ర ప్రభుత్వం (19 95) హ్యాండ్లూమ్ రిజర్వేషన్ చట్టం ప్రకారం చే నేతలకు 11రకాల రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు జరపాలి.ఉల్లంఘించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి.చట్టాల ఉల్లం ఘనలు నిరోధించి చేనేత హక్కులను కాపా డాలని పేర్కొన్నారు.చేనేత కార్మికులు ధర్నాకు బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కల మిట్ట శ్రీ నివాసులు కార్మికులకు మద్దతు తెలియ జేశా రు.చేనేత కార్మికుల 21సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వారికి సమర్పించారు.కాఫీ టు చేనేత భవన్ లో నరసింహారెడ్డికి అందచేశారు.ఈ కార్య క్ర మంలో కోడుమూరు కే.బుడ్డప్ప,బి.బాబు,కే. పురుషోత్తం,కే.శంకర్,గిడ్డయ్య,ఎస్.గంగాధర్,వెంకటేష్,రాఘవేంద్ర,మల్లికార్జున,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...