పి.జి.కోర్సులో ప్రతిభ చూపిన విద్యార్థులు ప రిశోధనలో కూడా అదే పరంపర కొనసాగించా లి...ఆచార్య వి.వెంకట బసవరావు,రాయల సీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్...
పి.జి.కోర్సులో ప్రతిభ చూపిన విద్యార్థులు ప రిశోధనలో కూడా అదే పరంపర కొనసాగించా లి
ఆచార్య వి.వెంకట బసవరావు,రాయల సీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్
పి.జి.కోర్సులో ప్రతిభ చూపిన విద్యార్థులు పరిశోధనలో కూడా అదే పరంపర కొనసాగిం చాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్‌ఛా న్స్‌లర్ ఆచార్య వి.వెంకట బసవరావు ఆకాం క్షించారు.ప్రస్తుతం యూనివర్సిటీ బోటనీ విభా గంలో ఆచార్య ఆర్.భరత్ కుమార్ పర్యవేక్షణ లో పరిశోధక విద్యార్థినిగా ఉన్న జి.ప్రసన్న జూ న్,10వ తేదీన జరిగిన శ్రీవెంకటేశ్వర యూ నివర్సిటీ కాన్వకేషన్లో ఎం.ఎస్.సి బోటనీలో బంగారు పతకం అందుకున్న సందర్భంగా ఆ మెను శుక్రవారం అభినందించారు.ఇదే స్ఫూ ర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో మంచి పరిశో ధకురాలుగా ఎదగాలని శుభాకాంక్షలు తెలిపా రు.2024లో రాయలసీమ యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థిగా చేరి మష్రూమ్ కల్చర్ (పు ట్ట గొడుగుల పెంపకం)పై పరిశోధన చేస్తున్న తనను ప్రోత్సహిస్తున్న ఆచార్య భరత్ కు మా ర్,విభాగ అధ్యాపకులకు విద్యార్థిని ప్రసన్న ధ న్యవాదాలు తెలిపారు.
Comments
Post a Comment