అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చే సిన హెచ్-ఫాస్ట్ బృందం...కల్తీ ఆహార పదార్థా లు స్వాధీనం...

అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ బృందం

కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబా ద్,జూన్,19 :

ఆహార కల్తీ,అసురక్షిత ఆహార పద్ధతులపై ని రంతర నిఘాలో భాగంగా హెచ్-ఫాస్ట్ (హైదరా బాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్) బృం దం,ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తో కలిసి చార్మినార్‌ లోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న పంచ్ మొహల్లా, న్యూలాడ్ బజార్‌లో ఉన్న ‘మెసర్స్ అల్ అ క్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’ ప్రాంగణాన్ని ఆక స్మిక తనిఖీ చేసింది.ఈ తనిఖీలో ప్రజారోగ్యాని కి తీవ్ర ముప్పు కలిగించే విధంగా అత్యంత అపరిశుభ్రమైన,ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆహార పదార్థాలను తయారు చేయడం,నిల్వ చేయడం జరుగుతున్నట్లు గుర్తించారు.అంతే కాకుండా ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్ నిర్బంధ ఎఫ్ ఎస్ ఎస్ ఎఐ లైసెన్స్ లేకుండా నిర్వహిం చడం జరుగుతుంది.నిషేధించబడిన/కృత్రిమ ఆహార రంగు లను (ఎం ఎస్ కె లయన్ గ్రీన్,రా స్ప్‌బెర్రీ రెడ్) ఉపయోగించడం,పాడైపోయిన,ప్ర మాదకరమైన వంట నూనెను పదే పదే ఉప యోగించడం,నీటి విశ్లేషణ ధృవీకర ణ,నాణ్య త నియంత్రణ చర్యలు లేకపోవడం,విపరీత మైన అపరిశుభ్ర వాతావరణం,కీటకాల నియం త్రణ లేకపోవడం వంటి చర్యలకు పాల్పడుతు న్నట్లు అధికారులు పేర్కొన్నారు.గోడౌన్ నుండి సుమారు 110కిలోల తయారు చేసిన ఫ్రైడ్ చి కెన్,ఆరు టిన్నుల వంట నూనె (ఒక్కొక్కటి 15లీటర్లు),కృత్రిమ రసాయన ఆహార రంగు లు స్వాధీనం చేసుకున్నారు.ఈ అక్రమ కార్యక లాపాలను నిర్వహిస్తున్న ఇద్దరు బాధ్యులను అదుపులోకి తీసుకున్నారు.వినియోగదారులు ఇలాం టి కల్తీ,అపరిశుభ్రమైన ఆహారాన్ని తీసు కోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదు ర్కోవాల్సి వస్తుంది.ఫుడ్ పాయిజ నింగ్,వాం తులు,విరేచనాలు,జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్లు, పదే పదే వాడిన నూనెను ఉపయోగించడం వ ల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు,కృత్రిమ ఆహా ర రంగుల వల్ల అలర్జీలు,టాక్సిసిటీ (విషపూరి తం) కావడం,కాలేయం,మొత్తం ఆరోగ్యంపై ప్ర భావం చూపే తీవ్రమైన వ్యాధుల ముప్పు పెర గడం జరుగుతుంది.ఈ నేపథ్యంలో నిందితు లు ఈ అసురక్షిత పద్ధతులను దాచిపెట్టి,విని యోగదారులకు కల్తీ ఆ హారాన్ని సరఫరా చే యడం ద్వారా ప్రజా రోగ్యాన్ని ప్రమాదంలో ప డేశారు.చట్ట విరుద్ధంగా లాభపడ్డారు.దీనిపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్,2006 (ఎఫ్ ఎస్ ఎస్ యాక్ట్ - 2006),ఇతర సంబంధిత చ ట్టాల నిబంధనల ప్రకారం హుస్సేనీ ఆలం పో లీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నిందితులతోపా టు స్వాధీనం చేసుకున్న సామగ్రిని హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు అప్ప గించారు.

ప్రజలకు అధికారుల సూచన :

1. లైసెన్స్ పొందిన సంస్థల నుండి మాత్ర మే ఆహారాన్ని కొనుగోలు చేయండి/తీసుకోండి.

2. కొనుగోలు చేయడానికి ముందు ఎఫ్ ఎస్ ఎ స్ ఎఐ లైసెన్స్‌ను తనిఖీ చేసుకోండి.

3. కృత్రిమ రంగులు కలిపిన లేదా అనుమా నాస్పద ఆహార పదార్థాలను నివారించండి.

4. అసురక్షిత ఆహార పద్ధతులపై అధికారుల కు ఫిర్యాదు చేయండి.

5. ఫిర్యాదుల కొరకు టోల్-ఫ్రీ నంబర్: 8712 661212 ను సంప్రదించండి.

6. ఆహార భద్రత,ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ప్రజలు అధికారులకు సహకరించాలి.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...