వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న రవాణా శా ఖ అధికారి...ప్రమాదంలో అక్కడికక్కడే మృ తి...

వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న రవాణా శాఖ అధికారి

ప్రమాదంలో అక్కడికక్కడే మృతి
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,భూపాలపల్లి, జూన్,23 :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధి నిర్వ హణలో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వ హిస్తున్న జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) వెంకన్న (47) బొగ్గు టిప్పర్ లారీ ఢీకొని అక్క డికక్కడే దుర్మరణం పాలయ్యారు.గణపురం మండలం చెల్పూరు శివారులోని ప్రాంతీయ ర వాణా శాఖ (RTO) కార్యాలయం ఎదుట పర కాల-భూ పాలపల్లి హైవేపై ఈ ప్రమాదం జరి గింది.సోమవారం ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో డీటీఓ వెంకన్న తన సి బ్బందితో కలిసి రోడ్డుపై స్కూల్ బస్సులు,ఇత ర వాహనాల తనిఖీలు చేపట్టారు.ఆ సమ యంలో ఒక సీజ్ చేసిన హార్వెస్టర్‌ను పక్కకు తరలించే ప్రక్రియ జరుగుతోంది.అదే సమయం లో బొగ్గు లోడుతో అతివేగంగా దూసుకొచ్చిన ఒక టిప్పర్ లారీ అదుపు తప్పి,మొదట హార్వె స్టర్‌ను ఢీకొట్టి,ఆపై పక్కనే తన కారు వద్ద నిల బడి ఉన్న డీటీఓ వెంకన్నపైకి బలంగా దూసుకె ళ్లింది.లారీ బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయా లపాలైన వెంకన్న అక్కడికక్కడే ప్రాణాలు కో ల్పోయారు.ఆయన వాహనం కూడా పాక్షికంగా దెబ్బతింది.కళ్ల ముందే జరిగిన ఈ ఘోరాన్ని చూసి తోటి సిబ్బంది,స్థానికులు తీవ్ర దిగ్భ్రాం తికి లోనయ్యారు.మృతి చెందిన రవాణా అధి కారి వెంకన్నది హన్మకొండ స్వస్థలం.ఆయన 2012 బ్యాచ్‌కు చెందిన రవాణా శాఖ అధికా రి...అత్యంత విషాదకరమైన విషయం ఏంటం టే,కేవలం 15రోజుల క్రితమే ఆయన జగిత్యా ల జిల్లా నుండి బదిలీ పై జయశంకర్ భూపాల పల్లి జిల్లా డీటీఓగా వచ్చి బాధ్యతలు స్వీకరిం చారు.విధుల్లో చేరిన కొద్దిరోజుల్లోనే ఇలా ప్ర మాదానికి గురికావడం రవాణా శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...