ప్రజా సేవే సన్మార్గం అని చాటి చెప్పిన వీర వని త టి.సి.లక్ష్మమ్మ...ముజఫర్ నగర్ లో ఘనం గా టిసి లక్ష్మమ్మ 11వ వర్ధంతి వేడుకలు...

ప్రజా సేవే సన్మార్గం అని చాటి చెప్పిన వీర వని త టి.సి.లక్ష్మమ్మ

ముజఫర్ నగర్ లో ఘనంగా టిసి లక్ష్మమ్మ 11వ వర్ధంతి వేడుకలు
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కల్లూరు,జులై, 18 :

ప్రజా సేవే సన్మార్గం అని చాటి చెప్పిన వీర వని త టిసి లక్ష్మమ్మ అని సిపిఎం నగర కమిటీ స భ్యులు సి.హెచ్.సాయిబాబా,కె.సుధాకరప్పలు అన్నారు.శనివారం కర్నూలు నగరం 32వ వా ర్డ్,ముజఫర్ నగర్,టిసి లక్ష్మమ్మ మహిళా కు ట్టు సెంటర్ లో ఐద్వా ఆధ్వర్యంలో టిసి లక్ష్మ మ్మ 11వ వర్ధంతి వేడుకలు ఐద్వా నాయకు రాలు జి.ధనలక్ష్మి అధ్యక్షతన ఘనంగా నిర్వ హించారు.కార్యక్రమానికి సిపిఎం నగర కమిటీ సభ్యులు సి.హెచ్.సాయిబాబా,కె.సుధాకర ప్ప,స్థానిక సిపిఎం నాయకులు వి.విజయ్ కుమార్,బషీర్,సురేష్ లు హాజరయ్యారు. ముందుగా టిసి లక్ష్మమ్మ చిత్ర పటానికి సి.హె చ్.సాయిబాబా,ధనలక్ష్మిలు పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా సి.హె చ్.సాయిబాబా,కె.సుధాకరప్పలు మాట్లాడా రు.1964లో సీపీఐ నుండి సిపిఎంగా ఆవిర్భా వం జరిగిన నేపథ్యంలో సిపిఎం పార్టీని తన భుజ స్కందాలతో ముందుకు తీసుకెళ్లిన మ హానీయులు టిసి నరసింహయ్య,టిసి లక్ష్మ మ్మలు అని కొనియాడారు.ఉన్నత సామాజిక వర్గంలో జన్మించిన కూడా కుల దురహంకారా నికి వ్యతిరేకంగా పోరాడారు.వారి జీవితం ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన త్యాగజీవు లు అన్నారు.1984లో ముజఫర్ నగర్ ప్రారం భ సమయంలో ప్రజలకు అండగా నిలిచి,కా లనీ ఏర్పాటుకోసం అహర్నిశలు కృషి చేశా రని చెప్పారు.కావున నేడు ముజఫర్ నగర్ నందు టిసి నరసింహాయ్య,టిసి లక్ష్మమ్మల జ్ఞా పకార్ధంగా గ్రంధాలయం,మహిళా కుట్టు సెం టర్ లను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొ న్నారు.గ్రంధాలయం ద్వారా పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా సేవలు అందిస్తున్నట్లు చె ప్పారు.అదేవిదంగా మహిళా కుట్టు సెంటర్ ద్వారా యువతులకు,మహిళలకు కుట్టు శిక్షణ అందించి,వారి భవిష్యత్ కు భరోసా కల్పించ డం జరుగుతుందన్నారు.ఈ నేపథ్యంలో మహి ళలు టిసి లక్ష్మమ్మ ఆశయ సాధన కోసం తమ వంతు ప్రయత్నం జరగాలని వారు సూచించా రు.ఈ కార్యక్రమంలో అఖిల భారత మహిళా సంఘం (ఐద్వా) నాయకురాళ్లు లక్ష్మి భాయ్, ఈశ్వరమ్మ,కన్యక,కుట్టు సెంటర్ శిక్షకురాలు కుమారి,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...