చిల్డ్రన్స్ పార్కులో టికెట్ దోపిడీ ఆరోపణలు... రూ.20టికెట్‌కు రూ.40వసూలు చేస్తున్నట్లు సందర్శకుల ఫిర్యాదు...

చిల్డ్రన్స్ పార్కులో టికెట్ దోపిడీ ఆరోపణలు

రూ.20టికెట్‌కు రూ.40 వసూలు చేస్తున్నట్లు సందర్శకుల ఫిర్యాదు

రెండేళ్ల చిన్నారులకు కూడా టికెట్ తప్పనిసరా?*

చిన్నారుల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన

మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టాలి
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కార్పో రేషన్,జులై,12 :

కర్నూలు నగరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు చిల్డ్ర న్స్ పార్కులో సందర్శకుల నుంచి అధిక టికెట్ ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు తీ వ్రంగా వినిపిస్తున్నాయి.టికెట్‌పై రూ.20గా ముద్రించి ఉండగా,దానిని రూ.40చొప్పున వ సూలు చేస్తున్నట్లు పలువురు సందర్శకులు ఆ రోపిస్తున్నారు.టికెట్ ధరలు పెంచినట్లయితే అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వు లు,సమాచార బోర్డులు ప్రజలకు స్పష్టంగా అందుబాటులో ఉంచాలని సందర్శకులు కో రుతున్నారు.అంతేకాకుండా,కేవలం రెండు సం వత్సరాల చిన్నారులకు కూడా ప్రవేశ టికెట్ త ప్పనిసరి చేయడం తల్లిదండ్రుల్లో తీవ్ర అసం తృప్తికి కారణమవుతోంది.ప్రభుత్వ రవాణా సంస్థ బస్సుల్లో కూడా సాధారణంగా నాలుగు సంవత్సరాలు దాటిన చిన్నారులకే పూర్తి టికె ట్ వర్తించే నిబంధనలు ఉన్నాయని పలువు రు పేర్కొంటున్నారు.అలాంటి పరిస్థితుల్లో చి న్నారుల వినోదం కోసం ఏర్పాటు చేసిన పా ర్కులో రెండేళ్ల పిల్లలకు కూడా టికెట్ వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తు న్నారు.చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన అ డ్వెంచర్ ఆట పరికరాల వద్ద తగిన భద్రతా చర్యలు,పర్యవేక్షణ సిబ్బంది లేకపోవడంతో ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరు వహిస్తా రని సందర్శకులు ప్రశ్నిస్తున్నారు.ఈ అంశా లపై పార్కు సిబ్బందిని నిలదీయగా మున్సి పల్ కమిషనర్‌ను అడగండి అంటూ నిర్లక్ష్యపు సమాధానం మరింత అగ్రహం కలిగిస్తుందని ఆవేదన చెందుతున్నారు.ప్రజల నుంచి రుసు ములు వసూలు చేస్తూ,పారదర్శకత,చిన్నారు ల భద్రత,సందర్శకులకు అవసరమైన కనీస సౌ కర్యాల విషయంలో నిర్లక్ష్యం చూపుతు న్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ వ్యవహారంపై జిల్లా,మున్సిపల్ అధికారులు వెంటనే విచారణ జరిపి,టికెట్ ధరలపై స్పష్టత ఇవ్వడంతో పాటు,నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లయితే బాధ్యులపై చర్యలు తీ సుకోవాలని సందర్శకులు డిమాండ్ చేస్తున్నా రు.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...