కర్నూలులో ఆధునిక హరిత ప్యాకేజింగ్ –బ్రాం డింగ్‌పై శిక్షణా శిబిరం...55మంది పారిశ్రామిక వేత్తలు హాజరు...
కర్నూలులో ఆధునిక హరిత ప్యాకేజింగ్ –బ్రాండింగ్‌పై శిక్షణా శిబిరం
55మంది పారిశ్రామికవేత్తలు హాజరు
సూక్ష్మ,చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ ల (ఎంఎస్ ఎంఈ) ఉత్పత్తులకు నాణ్యమైన ప్యాకేజింగ్,సమర్థవంతమైన బ్రాండింగ్ ద్వారా మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని,వి నియోగదారుల విశ్వాసం పెరిగి వ్యాపారాభి వృద్ధికి దోహద పడుతుందని నిపుణులు పేర్కొ న్నారు.సోమవారం రైజింగ్ అండ్ యాక్సిలరే టింగ్ ఎంఎస్‌ఎంఈ పెర్ఫార్మెన్స్ (రాంప్) పథ కం ఆధ్వర్యంలో భారతీయ ప్యాకేజింగ్ సంస్థ (ఇండియన్ ఇన్ స్టిట్యూట్ అఫ్ ప్యాకేజింగ్-ఐ ఐపి),హైదరాబాద్,ఆంధ్రప్ర దేశ్ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ కార్పో రేషన్ (ఎపిఎంఎస్ ఎం ఈడిసి)లు సం యుక్తంగా భారతీయ ప్యాకే జింగ్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్,ప్రాంతీయ అధి కారి ఎన్.నటరాజ్ స్వాగతం పలికారు.భారతీ య ప్యాకేజింగ్ సంస్థ అదనపు డైరెక్టర్,ప్రాంతీ య అధికారి ప్రొఫెసర్ (డా.)బాబు రావు గు డూరి అధ్యక్షతన కర్నూలు నగరంలోని మె ప్మా కాన్ఫరెన్స్ హాల్‌లో "ఆధునిక హరిత ప్యా కేజింగ్,బ్రాండింగ్" అంశంపై ఒకరోజు శిక్షణా శి బిరాన్ని నిర్వహించాయి.కార్యక్ర మానికి కర్నూ లు జిల్లాకు చెందిన 55మంది సూక్ష్మ,చిన్న,మ ధ్యతరహా పరిశ్రమల యజమానులు,మహిళా పారిశ్రామికవేత్తలు,స్వయం సహాయక సంఘా ల సభ్యులు,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్టార్టప్ వ్యవస్థాపకులు ఉత్సాహంగా హాజర య్యారు.ఈ సందర్బంగా మెప్మా టౌన్ ప్రాజెక్ట్ అధికారి నాగరాజు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ఉత్పత్తి నాణ్యతతో పాటు ఆకర్ష ణీయమైన ప్యాకే జింగ్,సమర్థవంతమైన బ్రాం డింగ్ కూడా విజయానికి కీలకమని అన్నారు. పర్యావ రణహిత ప్యాకేజింగ్ విధానాలను అవ లంబించడం ద్వారా దేశీయ,అంతర్జాతీ య మార్కెట్లలో మంచి అవకాశాలను అంది పుచ్చుకోవచ్చని సూచించారు.సాంకేతిక సమా వేశాల్లో నిపుణులు ఆధునిక ప్యాకేజింగ్ సాంకే తికతలు,పర్యావరణ హిత ప్యాకేజింగ్,బ్రాండిం గ్,గ్రాఫిక్ డిజైన్, లేబులింగ్ ప్రమాణాలు,నాణ్య తా ప్రమాణాలు,ఆహార భద్రతా నిబంధనలు, మార్కెటింగ్ వ్యూహాలు,విలువ ఆధారిత ఉ త్పత్తుల అభివృద్ధి వంటి అంశాలపై సమగ్రం గా అవగాహన కల్పించారు.నాణ్యమైన ప్యా కేజింగ్ ద్వారా ఉత్పత్తుల నిల్వ సామర్థ్యం, మార్కెట్ విలువ,వినియోగదారుల ఆదరణ గణనీయంగా పెరుగుతుందని వివరించారు. పారిశ్రామికవేత్తలు నిపుణులతో ప్రత్యక్షంగా చర్చించి తమ సందేహాలను నివృత్తి చేసుకు న్నారు.
ఈ శిక్షణ ద్వారా ఆధునిక ప్యాకేజింగ్,బ్రాండిం గ్‌పై విలువైన అవగాహన లభించిందని,తమ ఉత్పత్తులకు మార్కెట్‌లో మరింత గుర్తింపు, విక్రయావకాశాలు పెరుగుతాయని అభిప్రా యపడ్డారు.రాష్ట్రంలోని ఎంఎస్ ఎంఈలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం,మార్కెటింగ్ నై పుణ్యాలు,హరిత పారిశ్రామిక విధానాలపై మ రిన్ని శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేందు కు కట్టుబడి ఉన్నామని నిర్వాహకులు తెలి పారు.ఈ కార్యక్రమంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ ఎం.సుధాకర్,మెప్మా టెక్నికల్ ఎక్స్ పర్ట్ (బ్యాంక్ లింకేజ్) సరళమణి,అభివృద్ధి సలహాదారు ప్రేమ్ కుమార్ ఇల్లూరి,జిల్లా మ హిళా సమాఖ్య అధ్యక్షురాలు వి.పద్మావతి, ఎన్‌జీఓ సీఈఓ కె.అన్నోజిరావు,ఎన్.శివశం కర్,డి.మీనా కుమారి తదితరులు పాల్గొన్నా రు.
Comments
Post a Comment