అనామలీస్ ను త్వరితగతిన పరిష్కరించా లి...జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి...
అనామలీస్ ను త్వరితగతిన పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
సర్ కార్యక్రమంలో భాగంగా పెండింగ్‌లో ఉన్న అనామలీస్ అంశాల పరిష్కారాన్ని వేగవంతం చేసి,నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదే శించారు.బుధవారం ఎస్‌ఐ ఆర్ (SIR) ప్రక్రియ పురోగతిపై కలెక్టర్ ఈ ఆర్ఓ,ఏఈఆర్ఓ లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.నియోజకవర్గ, మండల వారీగా కలెక్టర్,జాయింట్ కలెక్టర్ ఎ ఎస్ డి అనామలీస్,డిఎస్ ఈ కేసుల పురోగ తిపై ఈఆర్వోలు,ఏఈఆర్ఓలతో సమీక్షించా రు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మం త్రాలయం, పాణ్యం నియోజకవర్గాల్లో ఎఎస్ డి,డిఎస్ ఈ కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నా యని,పెండింగ్ ఉన్న కేసులన్నింటినీ త్వరితగ తిన పూర్తి చేయాలన్నారు.అనామలీస్ పరి ష్కారంలో ఆశించిన స్థాయిలో పురోగతి లేద ని,ప్రతి ని యోజకవర్గంలో రోజుకు కనీసం 2 0,000 అనామలీస్ పరిష్కరించేలా అధికారు లు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు.స మ యం చాలా తక్కువగా ఉందని అనామలీస్ ను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్య లు తీసుకోవాలన్నారు.బుక్ ఏ కాల్ కు సంబం ధించిన పెండింగ్ లో ఉండే ఫిర్యాదులను త్వ రితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసు కోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ టె లికాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ నూ రుల్ ఖమర్,కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓ బులేసు,పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు,ఆదోని ఈ ఆర్ఓ అరుణ దేవి,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అ నురాధ,కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్,తది తరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment