ఫేక్ డిగ్రీలు...మూడు వేల మంది టీచర్ల తొల గింపు...

ఫేక్ డిగ్రీలు...మూడు వేల మంది టీచర్ల తొల గింపు
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబా ద్,జులై,10 :

బీహార్ లో నకిలీ సర్టిఫికేట్లు,ఫోర్జరీ సంతకాల తో అక్రమంగా ఉద్యోగాలు పొందిన దాదాపు మూడు వేల మంది ఉపాధ్యాయులను విధు ల్లోంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం సంచ లన నిర్ణయం తీసుకుంది.2006 నుంచి 2015 మధ్యకాలంలో జరిగిన ఉపాధ్యాయ నియామ కాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరో పణలపై విజిలెన్స్ బ్యూరో సుదీర్ఘ దర్యాప్తు చే పట్టింది.విజిలెన్స్ అధికారులు సమర్పించిన సమగ్ర నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ఈ కఠి నచర్యలకు ఉపక్రమించింది.ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది.కే వలం ఉద్యోగాల నుంచి తొలగించడమే కాకుం డా,సదరు ఉపాధ్యాయులపై చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించింది.ఇప్పటికే ఈ స్కామ్ తో సంబంధం ఉన్న పలువురిపై ఎఫ్ఎ ఆర్ నమోదు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.తప్పు చేసిన వారెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు,అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు సంపా దించి,ఇన్నేళ్లుగా ప్రభుత్వ ఖజానా నుంచి వా రు పొందిన జీతాలు,గౌరవ వేతనాలను పదిలే యకూడదని ప్రభుత్వం భావిస్తోంది.ఇంతకా లం వారు తీసుకున్న వేతన సొమ్ము మొత్తాన్ని వడ్డీతో సహా రికవరీ చేయాలని యోచిస్తున్న ట్లు సమాచారం.ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణ యం విద్యాశాఖతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీ వ్ర సంచలనం రేపుతోంది.

Comments

Popular posts from this blog

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...

కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్ తీరుతో విసిగిపోతున్నాం...రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి...బాధితురాలు బైరెడ్డి హరిత...