స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలవాలి...సమన్వ యంతో వ్యర్థాల నిర్వహణ చేపట్టాలి...రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్...

స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలవాలి

సమన్వయంతో వ్యర్థాల నిర్వహణ చేపట్టాలి

ప్రైవేటు సెప్టిక్ ట్యాంకులకు జీపీఎస్ అమర్చాలి

పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి
 
రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొ మ్మారెడ్డి పట్టాభిరామ్
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కార్పో రేషన్,జులై,23 :

కర్నూలు నగరాన్ని స్వచ్ఛతలో అగ్రస్థా నంలో నిలబెట్టేందుకు మున్సిపల్ యంత్రాంగం సమి ష్టిగా కృషి చేయాలని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొ రేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సూచిం చారు.బుధవారం స్థానిక ఎస్‌బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని న గరపాలక సంస్థ సమావేశ భవ నంలో క మిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి జిల్లాలోని మున్సిపల్,పబ్లిక్ హెల్త్,గ్రామీణ పా రిశుద్ధ్య శాఖల అధికారులతో సమీక్ష నిర్వ హించారు.అనంతరం జొహరాపురం డంప్‌ యార్డులో బయో మైనింగ్ ప్రక్రియను,గార్గేయ పురం డంప్‌యార్డులో బయో మైనింగ్ పనుల తో పాటు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్,ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ప్రతిపాదిత స్థలాలను కమిషన ర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేస్ట్ టు ఎనర్జీ ప్లాం ట్లను నిర్మిస్తున్నామని తెలిపారు.గార్గేయ పు రం డంప్‌యార్డులో నిర్మించే ప్లాంట్‌లో కర్నూ లు,నంద్యాల,అనంతపురం జిల్లాలకు చెందిన 12మున్సిపాలిటీల నుంచి వచ్చే వ్యర్థాలతో 12మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు.ఇందు కోసం ఇప్పటికే 15ఎకరాల భూమిని కేటాయించామని,రానున్న 18నెలల్లో పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు.అదేవి ధంగా గార్గేయపురం డంప్‌యార్డులో 9.5 ఎక రాల్లో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపట్టామని,రోజు కు 200 టన్నుల వ్యర్థాలను శుద్ధిచేసి తడి వ్య ర్థాలను ఎరువుగా,పొ డి వ్యర్థాలను రీసైక్లిం గ్‌కు వినియోగించే విధంగా ప్లాంట్ ఏర్పాటు చే యనున్నట్లు తెలిపారు.త్వరలోనే నిర్మాణ ప నులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.ఉ దయం విధులకు హాజరయ్యే పారిశుద్ధ్య కార్మి కులు సమయానికి అల్పాహారం తీసుకోలేక పోతున్న నేపథ్యంలో అక్షయ పాత్ర సంస్థతో చర్చించి ప్రభుత్వ ఆధ్వర్యంలో అల్పాహారం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలి పారు.అలాగే 'తల్లికి వందనం' పథకంలో పారి శుద్ధ్య కార్మికుల పిల్లలను కూడా ఈ ఏడాది నుంచి చేర్చామని,బుధవారం వారి ఖాతాల్లో నగదు జమ అయినట్లు వెల్లడించారు.రాష్ట్ర వ్యాప్తంగా 2,000 ఈ-ఆటోలను కొనుగోలు చేస్తున్నామని,కర్నూలు నగరానికి 91 ఈ-ఆ టోలను వచ్చే వారం నుంచి దశలవారీగా ఆగ స్టు,15లోపు అందజేస్తామని చెప్పారు.
ఈ-ఆటోల వినియోగానికి అవసరమైన చార్జిం గ్,పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి,గుత్తేదారు లతో సమన్వయం చేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఇటీ వల కర్నూలులోని ర్వహించిన 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' కార్యక్రమం విజయవంతంగా సాగిందని అభినందిస్తూ,కర్నూలు నగరపాలక సంస్థకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున పూర్తి సహ కారం అందిస్తామని తెలిపారు.బయోమైనింగ్ ద్వారా ప్రాసెసింగ్ చేసిన లెగసీ వ్యర్థాలను ఆగ స్టు,15లోపు సంబంధిత సంస్థలకు తరలించా లని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించారు.ప్రై వేటు సెప్టిక్ ట్యాంకుల ద్వారా సేకరించే వ్యర్థా లను ఎక్కడ పడితే అక్కడ పారబోయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని,అన్ని వాహనాల కు వెంటనే జీపీఎస్ పరికరాలు అమర్చాలని ఆదేశించారు.సేకరించిన వ్యర్థాలను తప్పని సరిగా దేవనగర్ ఎస్‌టీపీ వద్దనే డంపింగ్ చే  యాలని స్పష్టం చేశారు.కమిషనర్ చల్లా ఓబు లేసు విజ్ఞప్తి మేరకు కర్నూలు నగరంలో చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహిం చేందుకు మూడు కొత్త కంపాక్టర్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో అ దనపు కమిషనర్ ఆర్‌.జి.వి.కృష్ణ,డిప్యూటీ క మిషనర్ సతీష్ కుమార్ రెడ్డి,ఎస్‌ఈ రమణ మూర్తి,పబ్లిక్ హెల్త్ ఈఈ గుర్రప్ప యాదవ్,ప్ర జారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు,శానిటరీ సూపర్వైజర్ రమేష్,ఎంటమాలజిస్ట్ సత్యనా రాయణ,ఎంఈలు గిరిరాజ్,మనోహర్ రెడ్డి, డీ ఈఈలు వెంకటేశ్వర్లు,ఏఈ నాగేశ్వర్,పవన్ కు మార్ రెడ్డి,ఏఈలు వైష్ణవి,తదితరులు పాల్గొ న్నారు.

Comments

Popular posts from this blog

కోడుమూరు,కల్లూరు మండల గ్రామాలకు తా గునీటిని విడుదల చేయాలి...హంద్రీ పరివా హక పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యా లీ...

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...