నీట్ పరీక్ష పేపర్ల లీకేజ్ కి కారణమైన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను క్యాబినెట్ నుండి భర్త్ రఫ్ చేయలేని ప్రధాని మోడీ రాజీనామా చేయా లి...సిపిఎం డిమాండ్...
నీట్ పరీక్ష పేపర్ల లీకేజ్ కి కారణమైన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను క్యాబినెట్ నుండి భర్త్ రఫ్ చేయలేని ప్రధాని మోడీ రాజీనామా చేయాలి
సిపిఎం డిమాండ్
2026 నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి కారణమైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ ను కేంద్ర క్యాబినెట్ నుండి భర్త్ రఫ్ చేయడానికి చేతగాని ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని సిపిఎం జిల్లా కార్యద ర్శి డి.గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు.గత 20 రోజుల నుండి నీట్ పేపర్ల లీకేజీపై దేశంలో ఉ న్న విద్యార్థులు,యువజనులు కాక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ దగ్గర చేస్తు న్న ఆందోళనకు మద్దతుగా ప్రముఖ పర్యావర ణ వేత్త సోనం వాంగ్చుక్ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరవధిక నిరా హార దీక్ష చేపట్టిన వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా ఢిల్లీ పోలీసులు దొంగల్లాగా వచ్చి ఎత్తుకుని వెళ్లిన దానికి నిరసనగా నేడు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నా రు.ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు చ లో పార్లమెంటు ఇచ్చిన పిలుపుకు మద్దతుగా కర్నూలు నగరంలో జిల్లా పరిషత్ నుండి కలెక్ట ర్ కార్యాలయం వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యం లో సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్య దర్శి ఎం.రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సభను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశా య్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వరుసగా ప్రతి సంవత్సరం ఏదో ఒక పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకేజీలు జరుగుతున్నాయని చెప్పారు.ఇప్ప టికీ 29సార్లు పేపర్ లీకేజీలు జరిగాయని లీకే జ్ అరిక ట్టడానికి చేతగాని ప్రభుత్వం కేంద్రం లో ఉందని ఆయన ఘాటుగా విమర్శించారు. వరుసగా పేపర్ లీకేజీలు జరుగుతున్నప్పుడు బాధ్యత గల మంత్రి ఎవరైనా తక్షణమే రాజీ నామా చేసి బయటికి వెళ్తాడని,కానీ బిజెపి నా యకుడుగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా నిస్సిగ్గుగా దేశంలో తిరుగుతు న్నాడని మండిపడ్డారు.అలాంటి వ్యక్తి క్యాబి నెట్లో కొనసాగుతున్నాడని,ఆయనను భర్త్ రఫ్ చేయకుండా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని ఆ యన డిమాండ్ చేశారు.నీట్ పేపర్లు లీకేజి జరిగినప్పుడు బాగా చదివిన విద్యార్థులు 22 మంది ఆత్మహత్య చేసుకుంటే ఒక్క మాట కూ డా మాట్లాడని ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని పాలించే నైతిక హ క్కుకోల్పోయాడని ప్రశ్నిం చారు.ఏ రాజకీ య పార్టీకి సంబంధం లేని ప్ర ముఖ సైంటిస్టు,పర్యావరణ వేత్త విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు స్వయంగా మద్దతిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన నిరవధిక దీక్ష కూచుంటే సహించలేని మోడీ ప్రభుత్వం నిర్ధా క్షిణ్యంగా సోనం వాంగచుక్ ను అరెస్టు చేయ డం దుర్మార్గమైన చర్య అన్నారు.గతంలో జ మ్ము కాశ్మీర్లో పర్యావ రణాన్ని కాపాడాలని సో నం వాంగ్ చుక్ తండ్రి నిరవధిక దీక్ష చేస్తే నా డు ఉన్న ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా వె ళ్లి ఆయన డిమాండ్ ను అంగీకరిస్తూ దీక్షను విరమింపచేసిందని గుర్తు చేశారు.2014 లో అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా నిరవ ధిక దీక్ష చేస్తే ఆనాడు ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయనను దీక్ష విరమింపచేశాడని,ఇ ప్పుడున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు ఆ పని చేయట్లేదో ప్రజలకు సమాధానం చెప్పాల ని డిమాండ్ చేశారు.ధర్మేందర్ ప్రధానన్ భర్త్ ర ఫ్ చేస్తే దేశం ఏమైనా గొడ్డు పోతుందా అని ఆ యన ప్రధానిని ప్రశ్నించారు.విద్యార్థుల ప్రాణా ల కంటే పదవులు ముఖ్యం కాదని పరీక్షా వ్య వస్థను ప్రక్షాళన చేయకుండా ఇలాంటి మం త్రులను కొనసాగిస్తే దేశంలో విద్యా వ్యవస్థ నా శనం అవుతుందని,పరీక్షలపట్లే నమ్మకం లేకుం డా పోతుందని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా లక్ష లాదిమంది యువతి,యువకులు ఢిల్లీకి చేరు కుంటుంటే వారిని మార్గమధ్యంలోనే అడుక్కో వడం లాఠీ చార్జి చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన ఘాటుగా విమర్శించారు.ఇలాం టి ప్రభుత్వం దేశాన్ని పాలించడానికి ఏమాత్రం నైతిక హక్కులేదన్నారు.సోనం వాంగ్ చుక్క లాంటి పర్యావరణ వేత్తలు ఈ దేశానికి అవస రమని ఆయన చేస్తున్న డిమాండ్ న్యాయమై నదని చెప్పారు.కావున ఇప్పటికైనా కేంద్ర ప్రభు త్వం దిగివచ్చి విద్యార్థులతో చర్చించి,ధర్మేంద్ర ప్రధానన్ ను బర్త్ రఫ్ చేసి దేశంలో విద్యా వ్య వస్థను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశా రు.అనంతరం సిపి ఎం పార్టీ రాష్ట్ర కమిటీ స భ్యురాలు నిర్మల,సిపిఎం పార్టీ న్యూసిటీ కార్య దర్శి టి.రాముడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీటి పరీక్షల్లో జరిగిన అవకతవకలపై విద్యా ర్థులు ఆందోళన చేస్తుంటే ఈ రాష్ట్రం లో ఉన్న ప్రధాన పార్టీల నాయకులు నోరు మెదపక పో వడానికి కారణం ఏంటో రాష్ట్ర ప్రజలకు సమా ధానం చెప్పాలని నిలదీశారు.ఈ రాష్ట్రంలో ఉ న్న యువతి,యువకుల యొక్క ఓట్లు పొందిన మీరు ఒకవై పు వాళ్ల ప్రాణాలు పోతుంటే మౌ నంగా ఉండడం అంటే,విద్యార్థుల ప్రాణాలు ఏ మైనా పర్వాలేదని,ఈ పార్టీల భావనగా భావిం చాల్నా,ఈ పార్టీల యొక్క ఆలోచ నలను ప్రజ లు తెలుసుకోవాలని తెలిపారు.మోడీ ప్రభు త్వానికి ఊడిగం చేయడం కోసమే ఈ రాష్ట్రం లో ఉన్న యువతి,యువకుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.ఇప్పటికైనా ఎన్ డిఎ భాగ స్వాములుగా ఉన్న టిడిపి,జన సేన పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని ధర్మేందర్ ప్రధాని రాజీనామా చే యించాలని,అలాగే వైసిపి పార్లమెంట్లో ఈ అం శంపై మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్ర మంలో సిపిఎం జిల్లా కా ర్యదర్శి వర్గ సభ్యులు పి.ఎస్.రాధాకృష్ణ, జి.రామకృష్ణ జిల్లా,నగర, మండల నాయకులు అలివేలమ్మ,శ్యామల, పద్మ,జయ మ్మ,,నర్సింలు,సుధాకరప్ప,నగేష్, ప్రభా కర్,షరీఫ్,అబ్దుల్లా,విజయ్,రామకృష్ణ, ఖాజా,మాబుసా,కృష్ణ,హుస్సేనయ్య,మధు త దితరులు పాల్గొన్నారు.కార్యక్రమానికి మద్ద తుగా యునాని మెడికల్ విద్యార్థినిలు కూడా పాల్గొన్నారు.
Comments
Post a Comment