నకిలీ డీఏపీ ఎరువుల ముఠా గుట్టురటు...డీ ఎస్పీ బుర్రి శ్రీనివాసులు...
నకిలీ డీఏపీ ఎరువుల ముఠా గుట్టురట్టు
2,900 బస్తాలు స్వాదీనం
తొమ్మిది మందిపై కేసు నమోదు
డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు
నాగర్‌కర్నూల్ జిల్లాలో పోలీసులు నకిలీ డీఏ పీ ఎరువుల ముఠా గుట్టురట్టు చేశారు.ఇందు లో భాగంగా 2,900 నకిలీ డీఏపీ బస్తాల అక్ర మ వ్యాపారం వెలుగులోకి వచ్చింది.తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.ఇద్దరు నింది తులు పరారీలో ఉన్నారు.మహదేవునిపేటలో 110 నకిలీ డీఏపీ బస్తాలు,అమ్మాపల్లిలో 80 బస్తాలు,వెల్గొండలో 185 బస్తాలు స్వాధీనం చే సుకున్నారు.మరోవైపు రైతుల వద్ద వ్యవసా య,పోలీసు అధికారులు భారీగా నకిలీ ఎరు వులు గుర్తించారు.రంగారెడ్డి జిల్లాలో తయారీ కేంద్రం నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.నకిలీ ఎరువుల సరఫరాలో పలువురు మధ్యవర్తుల పాత్ర ఉ న్నట్లు తెలుస్తోంది.పోలీసుల విచారణలో జిల్లా లోని పలు మండలాలకు నకిలీ డీఏపీ సరఫ రా చేసినట్లు వెల్లడి చేశారు.ఈ సందర్బంగా డీ ఎస్పీ బుర్రి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభు త్వ అనుమతి పొందిన దుకాణాల్లోనే ఎరువు లు కొనుగోలు చేయాలనీ సూచించారు.ఎరు వులు కొనుగోలు చేసే ప్రతి రైతు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని అన్నారు.నకిలీ ఎరువు ల సమాచారం వెంటనే వ్యవసాయ శాఖ లే దా పోలీసులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment