చెరువులోకి దూసుకెళ్లిన కారు...ఐదుగురి మృ తి...

చెరువులోకి దూసుకెళ్లిన కారు...ఐదుగురి మృ తి
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,భువనేశ్వర్, జూలై 23 :

ఒడిశాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దేంకానాల్ జిల్లా సదర్ ఠాణా పరిధిలోని మ హిషాపుటా వద్ద గురువారం ఓ పెళ్లి బృందం కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిం ది.ప్రమాదాన్ని గుర్తించిన గ్రామస్థులు వెంటనే ట్రాక్టర్ సాయంతో కారును బయటకు తీశారు. అయితే అప్పటికే కారులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు ఊ పిరాడక మృతి చెందారు.ప్రాణా లతో బయటపడిన ఇద్దరిని దేంకానాల్ ఆసు పత్రికి తరలించారు.మృతులు బంగురిసింగి గ్రామానికి చెందిన చంద్రకాంత్ స్వయిన్,అవి నాష్ సాహు,అభిషేక్ సాహు,రాకేశ్ సాహు,రా మ్ సాహులుగా గుర్తించారు.బుధవారం రాత్రి వీరు ఓ వివాహానికి హాజరై,స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా...ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు కేం ఝర్ జిల్లాలో బుధవారం రాత్రి ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గు రు మృతి చెందారు.అస్వస్థతకు గురైన తమ కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.దీనికి సంబంధించి పూర్తి వి వరాలు తెలియాల్సి ఉంది.

Comments

Popular posts from this blog

కోడుమూరు,కల్లూరు మండల గ్రామాలకు తా గునీటిని విడుదల చేయాలి...హంద్రీ పరివా హక పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యా లీ...

దలారి వ్యవస్థ నడిపేది కర్నూలు ఆర్ డిఓ కె.సందీప్ కుమార్...వి.వి.నాయుడు,రాయల సీమ యువజన పోరాట సమితి అధ్యక్షులు...

డబ్బులు మూడింతలు చేస్తామని మోసం చే స్తున్న వ్యక్తి అరెస్ట్...యుగంధర్,వెల్దుర్తి సీఐ...