ప్రజానాట్యమండలి రాష్ట్ర మహాసభల జయ ప్రదం కోరుతూ విస్తృత ప్రచారం...
ప్రజానాట్యమండలి రాష్ట్ర మహాసభల జయ ప్రదం కోరుతూ విస్తృత ప్రచారం
కర్నూలు నగరంలో జూలై,25,26,27న జరిగే ప్రజానాట్యమండలి 11వ రాష్ట్ర మహాసభల ను మరియు రాష్ట్ర వీధి నాటకోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ ప్రజానాట్య మండలి కళాకారులు పాటలు పాడుతూ,విష యాన్ని వివరిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిం చారు.ఈ మేరకు బుధవారం కర్నూలు నగ రంలోని మార్కెట్ యార్డ్,కూరగాయల మార్కె ట్,కర్నూలు కొత్త బస్టాండ్ నుండి చౌరస్తా దా కా,పాతబస్తీలోని గడియారం హాస్పిటల్ నుం డి మండిబజార్ దాకా కళాకారులు ప్రచారం నిర్వహించారు.ప్రచారంలో భాగంగా ప్రజానా ట్యమండలి జిల్లా బాధ్యులు ఎం.డి.ఆనంద్ బాబు,జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నోమేశ్వరి, నాగరాజు,ఉపాధ్యక్షులు బతకన్న మాట్లాడా రు.70 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రజానా ట్యమండలి రాష్ట్ర 11వ మహాసభలు మొట్ట మొదటి సారిగా కర్నూలు నగరంలో మూడు రోజు లపాటు నిర్వహిస్తున్నామని,ప్రతిరోజు సాయంత్రం 5-00 గంటల నుండి రాత్రి 9:00 దాకా కర్నూలు మార్కెట్ యార్డులో రాష్ట్ర న లుమూలల నుండి వచ్చే కళాకారుల చేత సమాజాన్ని చైతన్యపరిచే నాటికలు,నృత్య రూపకాలు,పాటలు వివిధ రకాల కళ ప్రదర్శ నలు ఉంటాయని,ప్రజలంతా చూసి జయప్ర దం చేయడంతో పాటు మహాసభల నిర్వహ ణకు అన్ని విధాలుగా సహకరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సభ్యులు బజారి,సరిత,వేణమ్మ, లక్ష్మి,రామకృష్ణ,విజయ్,గిడ్డయ్య,గని,తదితరు లు పాల్గొన్నారు.
Comments
Post a Comment