ట్రాన్స్ కో డివిజనల్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ సోదాలు...
ట్రాన్స్ కో డివిజనల్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
తెలంగాణ ట్రాన్స్కో లో డివిజనల్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న ముత్యం వెంకటరమణ నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం ఉదయం ఆకస్మితగా ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు.ఆయన ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరో పణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు స మాచారం.ముత్యం వెంకటరమణకు సంబం ధించిన నివాసాలు,బంధువుల ఇళ్లతో పాటు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసా గుతున్నాయి.ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఈ దాడులు చేప ట్టినట్లు అధికారులు తెలిపారు.ఉదయం నుం చి ఏసీబీ బృందాలు రంగంలోకి దిగాయి.మా దాపూర్ లోని మీనాక్షి టవర్స్ లో ఉన్న ఏడో అంతస్తు ఫ్లాట్ సహా రాష్ట్రంలోని మొత్తం 10కి పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్ లో సుమారు 10ప్రత్యేక బృందా లు పాల్గొన్నట్లు సమాచారం.ఖమ్మం జిల్లా,పా ల్వంచలోని ఆస్తులతో పాటు కుటుంబ సభ్యు లు,బంధువులకు సంబంధించిన నివాసాల్లో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు.సోదా ల సందర్భంగా ఇంట్లో విలాసవంతమైన ఖరీ దైన చేతి గడియారాలు,20కి పైగా విదేశీ మ ద్యం బాటిళ్లు లభించాయి.స్వాధీనం చేసుకు న్న వాచీల మార్కెట్ విలువను అధికారులు ఆ న్‌లైన్ ద్వారా పరిశీలిస్తున్నారు.వీటి అసలు ధ ర,కొనుగోలు వివరాల పై కూడా విచారణ కొన సాగుతోంది.ఇంట్లో వ్యవసాయ భూములు,ఓపె న్ ప్లాట్లు, ఇతర స్థిరాస్తులకు సంబంధించిన ప లు డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వా ధీనం చేసుకున్నారు.సోదాల్లో భాగంగా ము త్యం వెంకటరమణకు సంబంధించిన బ్యాంకు లాకర్లు కూడా గుర్తించినట్లు సమాచారం.వా టిని తెరిచి పరిశీలించేందుకు అధికారులు ఏ ర్పాట్లు చేస్తున్నారు.లాకర్లలో లభించే నగదు, బంగారం లేదా ఇతర విలువైన వస్తువుల ఆ ధారంగా కేసులో మరిన్ని వివరాలు వెలుగు లోకి వచ్చే అవ కాశం ఉంది.
Comments
Post a Comment